నాణ్యమైన విద్యను అందించే.. ఉద్దేశంతో రాష్ట్రంలో ఐదు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చిందని... మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్‌లోని నూతనంగా ఏర్పాటు చేసిన అనురాగ్ విశ్వావిద్యాలయం ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు.

అంతర్జాతీయ విశ్వవిద్యాలయం స్థాయికి అనురాగ్ విశ్వవిద్యాలయం ఎదగాలని, ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగాలు లభించే విధంగా విద్యాబోధన జరగాలని ఆకాంక్షించారు. అనురాగ్ విద్యాసంస్థ కఠినమైన ప్రమాణాలు పాటించిందని అందుకే రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయ హోదా కల్పించిందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : పీఎస్‌కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు