గ్రామ పంచాయతీలు... మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలుగా మారడం వల్ల మేడ్చల్ జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. త్వరలో మాదారం గ్రామంలో భారీ ఐటీ సంస్థ రాబోతోందని... చాలా మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మేడ్చల్ నిలుస్తుందని మంత్రి చెప్పారు.
అనంతరం పోచారం మున్సిపల్ సర్వసభ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. పట్టణాల అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కలిసి కట్టుగా పని చేయాలని కౌన్సిలర్లుకు సూచించారు. మంత్రి వెంట జడ్పీ ఛైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి ఉన్నారు.
ఇదీ చూడండి: కరోనా పరిస్థితులపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష