వచ్చే వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి అధికారులు, సిబ్బంది పూర్తిగా సన్నద్ధం కావాలని రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో సుమారు రూ. 5.50 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను మేయర్ జక్కా వెంకట్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు.
సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ముంపు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు.
ఇదీ చూడండి: MURDER: చెల్లితో అసభ్య ప్రవర్తన.. రోకలిబండతో చంపిన సోదరి