కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సుమారు 24 వేల పట్టభద్రుల ఓట్లు నమోదయ్యాయని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. వారందరూ తెరాస అభ్యర్థి సురభి వాణీదేవికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస కార్యకర్తలతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు.
ఎంతో మందిని పట్టభద్రులను చేసిన ఘనత పీవీ కుమార్తె సురభి వాణీదేవికి ఉందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో పలువురు నేతలు పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇదీ చదవండి: పట్టభద్రులు ఓటు వేసేలా కార్యకర్తలు కృషి చేయాలి: కేకే