ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించి అంటు వ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలని మంత్రి మల్లారెడ్డి సూచించారు. ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు పది నిమిషాల పాటు ‘మీకోసం' కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని తన నివాసంలో పాల్గొన్నారు. నివాసంలోని వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రాంతాలు, పూల తొట్టిలోని నీటిని మంత్రి స్వయంగా పరిశీలించి తొలగించారు.
పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మేడ్చల్ జిల్లా ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలకు సూచించారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడాలన్నారు.
ఇదీ చూడండి: 'లాల్‌దర్వాజ బోనాలు కూడా ఇంతే.. ప్రజాక్షేమం కోసమే.!'