రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పని చేసే చోట వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుందని మంత్రి చామకూర మల్లారెడ్డి(minister malla reddy) పేర్కొన్నారు. మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి(collector sweta mohanty)తో కలిసి కాప్రా మండలంలోని జవహార్‌నగర్‌లో… నూతనంగా నిర్మించిన తహసీల్ ఆఫీస్ మీటింగ్ హాల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ తరుణంలో మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్ శ్వేతా మహంతి తహశీల్ ఆఫీస్ ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా స్థానిక నాయకులు తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను మంత్రి మల్లారెడ్డి(minister malla reddy) దృష్టికి తీసుకురాగా… సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ శ్వేతా మహంతికి మంత్రి తెలిపారు. ఈ విషయమై కలెక్టర్(collector sweta mohanty) స్పందిస్తూ ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వెల్లడించారు.
కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, మున్సిపల్ కమిషనర్ గోపి, ఆర్డీవోలు రవి, మల్లయ్య, తహసీల్దార్ గౌతమ్ కుమార్, జవహర్ నగర్ మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్, శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ బి.లావణ్య, రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి.రవీందర్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: covid test: కరోనా టెస్టు సమయంలో ముక్కులో విరిగిన స్క్వాబ్