అన్ని వర్గాల ప్రజలు పండుగలను సంతోషంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా పోచారం, ఘట్కేసర్, బోడుప్పల్ మున్సిపాలిటీల్లోని క్రైస్తవులకు జడ్పీ ఛైర్మన్‌తో కలిసి దుస్తులను పంపిణీ చేశారు.
సంక్షేమ పథకాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ముందుందని... ఇతర రాష్ట్రాలు మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'సమష్టి కృషితోనే సమ్మిళిత అభివృద్ధి'