కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో (Minister Malla Reddy Comments) ధ్వజమెత్తారు. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ పార్టీల కార్యకర్తలు తెరాసలో చేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లి వచ్చిన రేవంత్ రెడ్డికి... పీసీసీ ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు.
రేవంత్ రెడ్డి... మోసగాడు, దొంగ అంటూ విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంతగానో మేలు చేస్తున్నాయన్నారు. రూ. 50 కోట్లు పెట్టి పీసీసీ పదవిని రేవంత్ రెడ్డి కొనుక్కున్నారని మల్లారెడ్డి (Minister Malla Reddy Comments) ఎద్దేవా చేశారు.
గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదని అన్నారు. ప్రజల కోసం పనిచేస్తూ బంగారు తెలంగాణను సుసాధ్యం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి మాట్లాడితే ఊరుకునేది లేదని మంత్రి మల్లారెడ్డి హెచ్చరించారు.
సీఎంది గొప్ప మనసు. రాత్రిపగలు మనకోసమే ఆలోచించే గొప్ప నాయకుడు. సీఎంను చర్లపల్లి జైలుకు వెళ్లివచ్చిన పీసీసీ చీఫ్ తిడుతుండు. 50 కోట్లు పెట్టి పీసీసీ కొనుక్కుని సీఎంను, కేటీఆర్‌ను తిడుతుండు. ఇన్ని పనులు చేస్తున్నా తిడుతుండు. వాళ్లు ఏమైన చేసిండ్రా పదేళ్లు వాళ్లే కదా అధికారంలో ఉన్నది. మొన్న జైలుకెళ్లి వచ్చినోడు సీఎంను దొంగ అంటడు. ఎంత పెద్ద మాటలు మాట్లాడుతుండు. మహాత్ముడిని పట్టుకుని అట్ల మాట్లాడుతరా?
-- మల్లారెడ్డి, కార్మిక శాఖ మంత్రి
ఇదీ చూడండి: Revanth Reddy: 'పోడు భూములను హరితహారం కింద గుంజుకున్నారు'
ఇవీ చూడండి: MALLAREDDY: 'ఇద్దరం పోటీ చేద్దాం.. ఎవరు గెలిస్తే వారే హీరో!'