ETV Bharat / state

బ్రహ్మ కుమారీస్ ధ్యాన కేంద్రంలో మంత్రి హరీశ్​ - కె. కేశవరావు

మేడ్చల్​ జిల్లా మల్కాజ్​గిరిలోని బ్రహ్మ కుమారీస్ ధ్యాన కేంద్రాన్ని మంత్రి హరీశ్​రావు సందర్శించారు. ధ్యాన ప్రక్రియ ప్రాశస్త్యాన్ని.. బ్రహ్మకుమారీలను అడిగి తెలుసుకున్నారు మంత్రి.

Minister Harish at the Brahma Kumaris Meditation Center in the part of mlc election campaign
బ్రహ్మ కుమారీస్ ధ్యాన కేంద్రంలో మంత్రి హరీశ్​
author img

By

Published : Mar 4, 2021, 4:44 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్ రావు తీరిక లేకుండా గడుపుతున్నారు. మేడ్చల్ జిల్లా​ మల్కాజ్గి​రిలోని బ్రహ్మ కుమారీస్ ధ్యాన కేంద్రాన్ని ఆయన సందర్శించారు. తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్​రెడ్డికి ఓటు వేయాల్సిందిగా కోరారు.

బ్రహ్మకుమారీలు.. ధ్యాన కేంద్రంలోని చిత్ర పటాలు చూపిస్తూ వాటి అర్థాన్ని మంత్రికి వివరించారు. అనంతరం బ్రహ్మకుమారీస్ జెండాను రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావుతో కలిసి ఎగురవేశారు.

ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక నేతలు హాజరయ్యారు.

ఇదీ చదవండి: కేయూ అభివృద్ధిపై తెరాస చిన్నచూపు: ఉత్తమ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.