ETV Bharat / state

రైతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కృషి: మల్లారెడ్డి - Minister Mallareddy Speech

మేడ్చల్​ జిల్లాలో 40 లక్షల విలువ చేసే.. రైతులకు వ్యవసాయ పరికరాలను మంత్రి మల్లారెడ్డి అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కృషి చేస్తున్నారని మంత్రి వెల్లడించారు.

Chamakura Malla Reddy
Chamakura Malla Reddy
author img

By

Published : Dec 23, 2020, 3:11 PM IST

రైతు దినోత్సవం సందర్భంగా మేడ్చల్​ మండలంలోని ఎస్సీ, ఎస్టీ రైతులకు ఎమ్​ఎల్​ఆర్​ ఇనిస్టిట్యూట్​ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ విద్యార్థులు రూపొందించిన 40 లక్షల విలువ చేసే.. వ్యవసాయ పరికరాలను మంత్రి మల్లారెడ్డి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో అందజేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కృషి చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. ఎమ్​ఎల్​ఆర్​ సంస్థ రైతులకు పరికరాలు అందజేయడం మంచి పరిణామమని పేర్కొన్నారు.

రైతుల కోసం విద్యార్థులు వేర్వేరు కంపెనీలతో సంప్రదింపులు జరిపి.. పరికరాలు తయారు చేశారని ఎమ్​ఎల్​ఆర్​ సంస్థ అధినేత రాజశేఖర్ అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని మరో 4 మండలాల్లో కోటి అరవై లక్షలతో వ్యవసాయ పరికరాలు అందజేసి చిన్న, సన్నకారు రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా తయారు చేస్తున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.