మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గంలోని నిరుపేదలకు మైనంపల్లి ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆ ట్రస్ట్ ఛైర్మన్ మైనంపల్లి రోహిత్ అన్నారు. లాక్డౌన్ కారణంగా 67 రోజుల్లో మైనంపల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో 600 కింటళ్ల బియ్యం, నిత్యావసర సరకులు, మాస్కులు, శానిటైజర్స్‌ను పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు.
నియోజకవర్గంలో దోమల బెడద లేకుండా ఉండేందుకు డ్రోన్లు, ట్రాక్టర్ల సహాయంతో హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేశామన్నారు. ఉపాధి కోల్పోయి ఎవరైన ఇబ్బందులు పడుతున్న వారు తమకు సమాచారం అందిస్తే.. తమ ట్రస్ట్ సభ్యులు నిత్యావసరాలను అందిస్తారని రోహిత్ తెలిపారు.