మేడ్చల్ జిల్లా కూకట్ పల్లి డిపో వద్ద ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరాహార దీక్షకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మద్దతు తెలిపారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులను అణచివేయలని చూస్తున్నారని ఆరోపించారు. కార్మికులను, ప్రతిపక్షాలను ప్రజలకు దూరం చేయాలని చూస్తున్నారు అని విమర్శించారు. తమ గోడు చెప్పుకునేందుకు ట్యాంకుబండ్‌పై మిలియన్ మార్చ్ కార్యక్రమం ఏర్పాటు చేస్తే... మహిళా కార్మికులపై లాఠీచార్జి చేసి వారిని తీవ్ర గాయాలపాలు అయ్యేలా చేయడం దారుణమన్నారు. హైకోర్టు చెప్పినా కేసీఆర్ పట్టించుకువడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇది చూడండి: ఆర్టీసీ ఐకాస నిరాహార దీక్ష వాయిదా