ETV Bharat / state

రేవంత్​రెడ్డికి చేదు అనుభవం.. అర్ధాంతరంగా వెనుదిరిగిన ఎంపీ - తెలంగాణ వార్తలు

కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మేడ్చల్​ జిల్లాలో నాలాలో పడి మరణించిన సుమేధ తల్లిదండ్రులను పరామర్శించడానికి రేవంత్​ వచ్చారు. రహదారుల సమస్యపై రేవంత్​ను నిలదీసిన స్థానికుడు.. మిమ్మల్ని గెలిపించుకోవడం.. తమ దౌర్భాగ్యం అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

రేవంత్​రెడ్డికి చేదు అనుభవం.. అర్ధాంతరంగా వెనుదిరిగిన ఎంపీ

author img

By

Published : Sep 27, 2020, 11:53 PM IST

పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మేడ్చల్ జిల్లా నేరేట్​మెట్​ దీన్​ దయాళ్​నగర్​లో నాలాలో పడి మృతిచెందిన సుమేధ తల్లిదండ్రులను పరామర్శించడానికి రేవంత్​ వచ్చారు. అనంతరం నాలాను పరిశీలన వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

రహదారుల సమస్యపై రేవంత్​ను నిలదీసిన స్థానికుడు.. మిమ్మల్ని గెలిపించుకోవడం.. తమ దౌర్భాగ్యం అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. స్థానిక ఎమ్మెల్యే తెరాస వ్యక్తి కావడం.. ఎంపీ కాంగ్రెస్​కు చెందిన వారు కావడం వల్ల అభివృద్ధి కుంటుపడిందంటూ రేవంత్​ ముందే తన అసంతృప్తి వ్యక్తం చేశాడు.

స్థానికంగా రోడ్లు సరిగ్గా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పరిణామంతో రేవంత్​ తన పర్యటనను ముగించుకొని వెనుదిరిగారు.

ఇదీ చూడండి: ఒక్కో డీసీసీ అధ్యక్షుడు ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించాలి: మాణిక్కం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.