ETV Bharat / state

బాచుపల్లి పోలీస్​ స్టేషన్​ భవన నిర్మాణానికి శంకుస్థాపన - telangana varthalu

శివారు ప్రాంతాల్లో భద్రతే లక్ష్యంగా అత్యాధునిక టెక్నాలజీతో పోలీస్ స్టేషన్లలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ అన్నారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి సీపీ సజ్జనార్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానందలు శంకుస్థాపన చేశారు.

Bachupally Police Station
బాచుపల్లి పోలీస్​ స్టేషన్​ భవన నిర్మాణానికి శంకుస్థాపన
author img

By

Published : Apr 10, 2021, 2:40 PM IST

బాచుపల్లి పోలీస్ స్టేషన్ శాశ్వత భవన నిర్మాణానికి సైబరాబాద్ సీపీ సజ్జనార్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానందలు తమ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ కార్పొరేషన్ మేయర్ నీలా గోపాల్ రెడ్డి, అరబిందో సంస్థల ఛైర్మన్ నిత్యానంద రెడ్డిలు పాల్గొన్నారు. నగర శివారు ప్రాంతాల్లో జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఏర్పడిన బాచుపల్లి పోలీసు స్టేషన్​ను ఏర్పాటు చేయగా... అరబిందో సంస్థల ఛైర్మన్ సీఎస్ఆర్ ఫండ్ కింద రెండెకరాల స్థలంలో 3.5 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.

శివారు ప్రాంతాల్లో భద్రతే లక్ష్యంగా అత్యాధునిక టెక్నాలజీతో పోలీస్ స్టేషన్లలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా సేవలందించేందుకు పోలీసులు ముందుంటారని ఆయన అన్నారు. సైబరాబాద్ పరిధిలో మొత్తం నాలుగు పోలీస్​ స్టేషన్లకు శంకుస్థాపన చేసినట్లు సీపీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కొవిడ్ చికిత్సకు సర్కారు నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.