ETV Bharat / state

వరద బాధితులకు రూ.30వేలు చెల్లించాలని వినతి పత్రం

author img

By

Published : Nov 3, 2020, 4:51 PM IST

గ్రేటర్ పరిధిలోని వరద బాధితులకు రూ.30వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఎంపీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 5, 6, 7వ తేదీలలో వినతి పత్రం ఇస్తామని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని మూడు జోనల్ కమిషనర్ కార్యాలయాల్లో వినతి పత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.

kuna srisailam on behalf of congress party demanding Flood victims will be given Rs 30,000
వరద బాధితులకు రూ.30వేలు చెల్లించాలని వినతి పత్రం

వరద బాధితులకు అందాల్సిన సాయం అందరికి అందకపోవడమే కాకుండా అక్రమాలు చోటుచేసుకున్నాయని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ ఆరోపించారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని మూడు జోనల్ కమిషనర్ కార్యాలయాల్లో ఎంపీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించనున్నట్లు వెల్లడించారు.

ఈ నెల 5వ తేదీన ఎల్బీ నగర్, 6న మల్కాజిగిరి, 7న కూకట్​పల్లి.. జీహెచ్ఎంసీ జోనల్ కార్యలయాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పిస్తామన్నారు. గ్రేటర్ పరిధిలోని వరద బాధితులకు రూ.30వేలు ఇవ్వాలనేది తమ ప్రధాన డిమాండ్​గా పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ప్రమాదం: క్రేన్​ ఢీకొని వ్యక్తి అక్కడిక్కడే మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.