కూకట్పల్లిలో నూతనంగా నిర్మిస్తోన్నఫ్లైఓవర్ పనులను మేయర్ బొంతు రామ్మోహన్ మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. కూకట్పల్లినుంచి బాలానగర్ వైపుగా వెళ్లే రహదారిలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ఎస్సార్డీపీ పనుల్లో భాగంగా చేపట్టిన ఈ పైవంతెనను యుద్ధప్రాతిపదికన నిర్మిస్తున్నామని మేయర్ తెలిపారు.
లాక్డౌన్ ఉండటం వల్ల దీనిని అనుకున్న సమయం కంటే ముందుగానే అందుబాటులోకి తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పనులు వేగవంతం చేసేందుకు అడ్డుగా ఉన్న నిర్మాణాల తొలగింపు, కావాల్సిన ఇతర కమోడిటీస్పై మున్సిపల్ సెక్రటరీతో కలిసి గుత్తేదారుకు పలు సూచనలు చేశారు.