ఉపరితల ఆవర్తనంతో మేడ్చల్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. మల్కాజిగిరి, నేరెడ్మేట్, కుషాయిగూడ, దమ్మాయిగూడా, జీడీమెట్ల, కుత్బుల్లాపూర్, గాజులరామరం, జగద్గిరిగుట్ట, చింతల్, కొంపల్లి, సూచిత్ర, దుండిగల్లో భారీ వర్షం పడింది.
సూరారంల తెలుగుతల్లినగర్‌లోని పలు ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు చేరడం వల్ల వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి: హైదరాబాద్లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం