పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని జవహర్నగర్ తెరాస పార్టీ అధ్యక్షులు కొండల్ తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 23వ డివిషన్ కార్పొరేటర్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటో యూనియన్ అధ్యక్షులు కృష్ణవర్మ హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ తెరాస పార్టీ అధ్యక్షులు భాషావోని కొండల్ ముదిరాజ్ పాల్గొన్నారు.
ఈసారి రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవడం వల్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గొడుగు వేణు ముదిరాజ్, కోనేరు భాస్కర్, మాధవరెడ్డి, పూడూరు చందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఆదర్శానికి నిలువెత్తు ఆ ఉపాధ్యాయులు...