స్వర్గీయ నందమూరి హరికృష్ణ కూతురు, కూకట్పల్లి నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జీ సుహాసిని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ రమ్య సెంటర్ వద్ద అభిమానులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సుహాసినికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు నిరంతరం పేదల సంక్షేమం కోసమే పాటుపడ్డారని కేపీహెచ్బీ 144 డివిజన్ అధ్యక్షులు షేక్ సత్తార్ పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: ప్రతి రోజూ పళ్లెంలో ఇవి తప్పనిసరిగా ఉండేలా..