నగరవాసులు స్వచ్ఛమైన గాలిలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబసభ్యులతో కలిసి కాసేపు సేదతీరడానికి ఉద్యానవనాలు ఎంతో తోడ్పడతాయని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని ఆక్సీజన్ పార్కులో నడకదారిని, పక్షుల ఎన్క్లోజర్ను, బహదూర్‌పల్లిలోని ఆయుష్‌వనం పార్కును కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. వివిధ దేశాల నుంచి తెచ్చిన పక్షులను ఎన్‌క్లోజర్‌లో వదిలారు. 57ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పార్కును అధికారులు అభివృద్ధి చేశారని ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పార్క్‌లను నగరవాసులు వినియోగించుకోవాలని మంత్రి మల్లారెడ్డి సూచించారు.
- ఇదీ చూడండి : సిద్దిపేటలో రూ. 2 కోట్ల విలువ చేసే గంజాయి పట్టివేత