మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ అధికారులు చాకచక్యంతో.. పోలీస్ అంటూ అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. కీసరగుట్ట వీడి అడ్డా.. ప్రేమ జంటలని వీడు టార్గెట్ చేస్తాడు. ఒంటరిగా, ఏకాంత ప్రదేశాలలో తిరిగేవారిని ఎంచుకుంటాడు.
ఈ నెల 3వ తేదీన బాధితుడు రామిడి శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు. నల్లగుట్ట నివాసి అయిన ఉపాధ్యాయ సురేష్, కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో.. ఎస్ఓటి పోలీస్ అంటూ ఒంటరిగా దొరికిన ప్రేమ జంటల వీడియోలు తీసి డబ్బుల వసూలకు పాల్పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. స్థానిక సిఐ నరేందర్ అదేశాల మేరకు క్రైమ్ బృందం నిఘా పెట్టింది.
ఈరోజు కీసరగుట్టలో నిందితుడు సురేష్ పట్టుబడ్డాడు. ఇతని బెదిరింపులకు గతంలో శ్రీకాంత్ రెడ్డి... ఐదువేల రూపాయలు ఇచ్చుకున్నాడు. తరువాత కూడా కాల్ చేసి పలుమార్లు డబ్బులు డిమాండ్ చేయటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. నిందితుడు సురేష్‌పై పలు కేసులు నమోదు చేసి.. అనంతరం రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చూడండీ: ఆటోలో గంజాయి అక్రమ రవాణా.. ఇద్దరు అరెస్టు