మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరగుట్టలో అతిపురాతన రామలింగేశ్వర దేవాలయాన్ని జైనులు, కాకతీయుల హయాంలో నిర్మించారు. అప్పట్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని గుప్తనిధుల కోసం కొందరు తవ్వారంటూ ఫిర్యాదులు రాగా.. రెవెన్యూ అధికారులు వచ్చి పరిశీలించారు.
కీసరగుట్ట ఆలయంలో రాత్రి వేళల్లో గుర్తుతెలియని దుండగులు కొబ్బరికాయలు కొట్టి, నిమ్మకాయలతో పూజలు చేసి తవ్వకాలు చేపట్టినట్లు ఆనవాలు కనిపించాయని స్థానికులు పేర్కొన్నారు. ఈ విషయమై కీసర పోలీసులను అడగగా తమ వద్ద ఎలాంటి సమాచారం లేదన్నారు.