లాక్డౌన్లో ఉపాధి లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పేదప్రజలను ఆదుకోవడానికి దాతలు అంకితభావంతో ముందుకు రావాల్సిన అవసరముందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అభిప్రాయపడ్డారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అడిక్మెట్ డివిజన్లో తెరాస నేత మల్లికార్జున్రెడ్డి ఆధ్వర్యంలో బస్తీవాసులు, పేదలకు ఆయన నిత్యావసర సరుకులను అందజేశారు. లాక్డౌన్ పూర్తిగా సడలించే వరకు ప్రజలందరూ భౌతికదూరం పాటిస్తూ కరోనా కట్టడికి తమవంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసరమై బయటకు వచ్చిన వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇవీ చూడండి: పత్తికి అదనంగా రూ.275 పెంచండి!