ETV Bharat / state

కరోనా బాధితులకు సరైన చికిత్స అందించాలి: కలెక్టర్ - తెలంగాణ న్యూస్ అప్​డేట్స్

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని ఘట్‌కేసర్‌లోని ప్రభుత్వ ఉప ఆరోగ్య కేంద్రంలో ఐసోలేషన్‌ వార్డుల రికార్డులను కలెక్టర్ శ్వేతా మహంతి పరిశీలించారు. కరోనా బాధితులకు అన్ని రకాల వసతులు సమకూర్చడంతో పాటు వారికి సరైన చికిత్స అందించాలని పేర్కొన్నారు.

కలెక్టర్
కలెక్టర్
author img

By

Published : May 11, 2021, 10:31 PM IST

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో కరోనా బాధితులకు అన్ని రకాల వసతులు సమకూర్చడంతో పాటు వారికి సరైన చికిత్స అందించాలని ఈ విషయంలో వైద్యాధికారులు సమర్థవంతంగా తమ విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పేర్కొన్నారు. అదనపు కలెక్టర్‌ జాన్‌శ్యాంసన్‌తో కలిసి ఘట్‌కేసర్‌లోని ప్రభుత్వ ఉప ఆరోగ్య కేంద్రంలోని వ్యాక్సిన్‌ జరుగుతున్న తీరు, ఐసోలేషన్‌ వార్డుల రికార్డులను పరిశీలించారు.

ఎంత మేర ఆక్సిజన్‌ నిల్వ ఉంది.. ఏమైనా సమస్యలు ఉన్నాయని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కరోనా కేసుల విషయంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తుందన్నారు. డాక్టర్లు, సిబ్బంది ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదని కలెక్టర్‌ సూచించారు. ప్రజలందరూ కరోనాతో అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి హోం ఐసోలేషన్‌ కిట్టు అందించాలని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.