మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో బుధవారం అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శ్రీకాంత్ అనే వ్యక్తిపై బీరు సీసాలతో దాడి చేసి గాయపరచిన వ్యక్తులను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్య నగర్లో నివాసముండే శ్రీకాంత్... తన పని ముగించుకుని ఇంటికి వెళ్లే క్రమంలో మద్యం దుకాణానికి వెళ్లాడు. అక్కడ అప్పటికే మద్యం మత్తులో ఉన్న సాయి కిరణ్, కార్తీక్, కిరణ్, వినోద్, రవిలు బీరు కొనుక్కుని వారి బైకులో పెట్టే క్రమంలో అవి కిందపడ్డాయి.
బీరు సీసాలు కిందపడ్డాయని శ్రీకాంత్ నవ్వగా.. వారి మధ్య గొడవ మొదలైంది. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి పగిలిన బీరు సీసాలతో శ్రీకాంత్‌పై దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడ్డ శ్రీకాంత్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వెంటనే నిందితుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా వారిని పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు అల్వాల్ ఇన్స్పెక్టర్ యాదగిరి తెలిపారు.
ఇదీ చదవండిః ఇంటికెళుతుంటే అడ్డుకున్నారు.. బీరు సీసాతో విచక్షణారహితంగా కొట్టారు