కేశవాపూర్ జలాశయ నిర్మాణం కోసం అటవీ అనుమతులు లభించాయి. హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలు తీర్చేందుకు మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా కేశవపూర్ వద్ద పది టీఎంసీల సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకోసం 409.53 హెక్టార్ల అటవీభూమి అవసరమవుతుంది. ఈ మేరకు అటవీభూమి వినియోగానికి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతిచ్చింది. జలాశయ నిర్మాణం కోసం 409.53 హెక్టార్ల అటవీభూమిని ఉపయోగించుకునేందుకు అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర అటవీశాఖకు అనుమతి లేఖ అందింది.
- ఇదీ చూడండి: బకాయిలు విడుదల చేయాలని కేంద్రానికి కేటీఆర్ లేఖ