మేడ్చల్ జిల్లా కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు అప్రమత్తం కావడం వల్ల సురక్షితంగా బయటపడ్డారు. సకాలంలో స్థానికులు, స్థానిక పోలీస్ సిబ్బంది సహకరించగా పెను ప్రమాదం తప్పింది. అనంతరం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న కేపీహెచ్బీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి : 'అక్రమ వ్యాపారాలకు పాల్పడితే కఠిన చర్యలు'