మేడ్చల్ జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన ఓ 8 నెలల గర్భిణీ డెంగ్యూ జ్వరంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. నాలుగు రోజుల క్రితం తీవ్ర జ్వరం రావడం వల్ల యశోద ఆసుపత్రిలో చేర్చామని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. అయినా ఆమె ప్రాణాలు దక్కలేదని విలపిస్తూ చెప్పారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాలైన జవాహర్ నగర్, దమ్మాయిగూడ, నాగారం, కీసర డెంగ్యూ జ్వరాల కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని.... కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
ఇదీచూడండి:నిర్లక్ష్యం చేశారు... ప్రాణాలు తీశారు..!