వడగండ్ల ప్రభావంతో నష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించారు.
వడగండ్ల వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించారు. పాడైపోయిన పంట వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలని స్థానిక అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సునీతా రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.