Telangana Election Result in Combined Medak : తెలుగు రాష్ట్రాలతో పాటు సరిహద్దు ప్రాంతాలు, దేశంలోని వివిధ ప్రాంతల ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఫలితాలు ఊహించిన విధంగానే వచ్చాయి. బీఆర్ఎస్ (BRS) అధికారాన్ని కోల్పోయింది. హస్తం అధికారాన్ని చేజిక్కించకుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో తక్కువ స్థానాల్లో విజయం సాధించినా, ఇక్కడ రాజకీయం రోజురోజుకు ఉత్కంఠ రేకెత్తించింది. ప్రధానంగా ఇక్కడ గజ్వేల్ నుంచి కేసీఆర్, ఆయన పై పోటీగా బీజేపీ నుంచి ఈటల రాజేందర్ (Eetela Rajendar) పోటీలో నిలిచారు. అదేవిధంగా సిద్దిపేట నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే, మెజార్టీల్లో పోటీపడే హరీశ్‌రావు అక్కడ ఆసక్తిని నింపుతారు. కానీ ఈసారి మెజార్టీ విషయంలో గత ఎన్నికల కంటే తక్కువగానే వచ్చింది. గతంలో హరీశ్‌రావుగు లక్ష పై చిలుకు మెజారీటీ వస్తే ఈ ఎన్నికల్లో 83వేలతోనే సరిపెట్టుకున్నారు.
బీఆర్ఎస్ ఓటమిపై కన్నీటి పర్యంతమైన అభ్యర్థులు
BRS Won MLA Candidates : గతంలో కేసీఆర్ (KCR) 60వేల పై చిలుకు మెజారిటీ సాధిస్తే ఈ సారి మాత్రం 45వేల మెజార్టీతో సరిపెట్టుకున్నారు. దుబ్బాక నుంచి కొత్త ప్రభాకర్ 53వేల మెజార్టీతో రెండో స్థానంలో నిలిచారు. ఈసారి ఎన్నికల్లో కారు మెజార్టీతో జోరు కంటే ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి నానా తంటాలు పడినా ప్రయోజనంలేకపోయింది. ఇక్కడ బీజేపీ కచ్చితంగా గెలుస్తోందన్న నమ్మకం ఆ పార్టీ అధిష్ఠానంలో ఉంది. కానీ ఆ అంచనాలు తారుమారైనాయి. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క స్థానంలో కూడా బీజేపీ ఖాతా తెరవలేదు.
రాజ్‌భవన్‌లో నూతన సీఎం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు - మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్
సంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా 5 నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కె. మాణిక్ రావ్ 13వేల310 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్‌పై విజయం సాధించారు. అందోలు కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ 27వేల 427 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్‌పై గెలుపొందారు. నారాయణఖేడ్ కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డి 5వేల 766 ఓట్ల ఆధిక్యంతో బీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్ రెడ్డిపై విజయం సాధించారు. ఇక్కడ సంగారెడ్డిలో సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ (Congress) అభ్యర్థి జగ్గారెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ 9వేల 297 ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని సొంతం చేసుకున్నారు.
కాంగ్రెస్‌కు కొత్త తిప్పలు - శాసనమండలిలో ఒకే ఒక్క సభ్యుడు
Patancheru Constituency Result : పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధిచి మెుత్తం 23 రౌండ్ల ద్వారా ఓట్లను లెక్కించడానికి ఎన్నికల సిబ్బంది ఏర్పాటు చేసుకున్నారు. 22 రౌండ్ల వరకు ఫలితాలు వెల్లడించిన అధికారులు 23 రౌండ్ వద్ద బ్రేక్ పడింది. కాంగ్రెస్ అభ్యర్థి కాటాశ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్ (Mahipal Reddy) రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో పోటీ జరిగింది. కొన్ని లెక్కింపులపై తమకు అనుమానం ఉందని రీ-కౌంటింగ్ చేయాలని అధికారులకి విన్నవించారు. అధికారుల చర్చల అనంతంరం అయన లెక్కింపు కేంద్రం నుంచి బయటకు వెళ్లి పోయారు. అనంతరం మహిపాల్‌రెడ్డి విజయ సంకేతం చూపుతూ తామే విజయం సాధించానని తెలిపారు. మెత్తంగా కాటా శ్రీనివాస్ గౌడ్ పై 7వేల 091 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ లెక్కింపుపై తమకు అనుమానం ఉందని కాటా శ్రీనివాస్ గౌడ్ సతీమణి అభ్యంతరం వ్యక్తం చేశారు.
Congress Formed Government in Telangana : మెదక్ జిల్లాలో ప్రధానంగా రెండు నియోజకవర్గాలుండగా ఒకటి కాంగ్రెస్ విజయం సాధించగా మరొక స్థానానన్ని బీఆర్ఎస్ భర్తీ చేసుకుంది. మెదక్ నియోజకవర్గంలో మెదటి నుంచి కాంగ్రెస్ గెలుసుందనే నినాదాన్ని ఈ ఫలితాలు అద్దంపట్టాయి. దీంతో మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ (Mynampally Rohit) 10వేల157 మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి తమ ప్రత్యర్థి ఆవుల రాజిరెడ్డిపై 8వేల 855 ఓట్ల మెజారిటీతో నర్సాపూర్‌లో మరోసారి గులాబీ జెండా ఎగరేశారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు
మెత్తంగా చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌ఛార్జిగా మాజీ మంత్రి హరీశ్‌రావు పూర్తి భాద్యత వహించడంతో ఇక్కడ 7 స్థానాల్లో బీఆర్ఎస్ సీట్లు సంపాదించింది. కాంగ్రెస్ మాత్రం మూడు సీట్లకే పరిమితమైంది. కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటును కోల్పోయింది.
సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానిదే - సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేల తీర్మానం