మెదక్ పట్టణంలో మిషన్ భగీరథ పనులు నత్తనడకన సాగుతున్నాయని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశఆరు. వార్డుల వారిగా ఇంటింటికీ తిరిగి సమగ్ర వివరాలను పది రోజుల్లోగా సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతి, మిషన్ భగీరథ, కొత్త కలెక్టరేట్ నిర్మాణం, భూసేకరణ వంటి అంశాలపై కలెక్టర్ కార్యాలయంలో... మెదక్ శాసనసభ్యురాలు పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, ఇతర అధికారులతో మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు.
తూప్రాన్ మున్సిపాలిటీలో మార్కెట్ యార్డ్, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం వంటి పనులను వేగవంతం చేయాలని అన్నారు. రామాయంపేట మున్సిపాలిటీలో నీటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ భవనాన్ని మే నెల నాటికి ప్రారంభించేలా సిద్ధం చేయాలని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కాలువలతో పాటు పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన భూసేకరణ చేపట్టాలని మంత్రి చెప్పారు.
ఇదీ చూడండి: మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు... ప్రతిపక్షాల ఆందోళనలు