ETV Bharat / state

లాక్​డౌన్ ఎఫెక్ట్ : మద్యం దుకాణాల వద్ద కిటకిట

author img

By

Published : May 11, 2021, 9:00 PM IST

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్​డౌన్ విధించింది. సర్కార్ ఇలా ప్రకటన చేసిందో లేదో.. మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి మరీ మద్యం కోసం క్యూ కట్టారు.

medak district news, rush at wine shops in medak, medak wine shops
మెదక్ జిల్లాలో మద్యం దుకాణాల వద్ద రద్దీ, మెదక్ జిల్లా వార్తలు, మెదక్ జిల్లాలో వైన్ షాపులు

కరోనా కట్టడికి ఎట్టకేలకు రాష్ట్ర సర్కార్ లాక్​డౌన్ విధిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. బుధవారం ఉదయం 10 గంటల నుంచి లాక్​డౌన్ మొదలవ్వనున్నందున మద్యంప్రియులు వైన్ షాపుల వద్దకు పరుగులు తీశారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన మందుబాబులతో మద్యం దుకాణాలు కిక్కిరిసిపోయాయి.

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏ వైన్ షాపు చూసినా.. మందు బాబులతో కిటకిటలాడింది. మద్యం కొనుగోళ్ల హడావుడిలో ముఖానికి మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా నిబంధనలను ప్రజలు తుంగలోతొక్కారు. కొన్ని చోట్ల మద్యం కోసం తోపులాటలు కూడా చోటుచేసుకున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.