మెదక జిల్లా నర్సాపూర్ పట్టణంలోని శివాలయం వీధిలో పోలిసులు కట్టడిముట్టడి కార్యక్రమం నిర్వహించారు. సీఐ నాగయ్య ఆధ్వర్యంలో నలుగురు ఎస్సైలు, నలుగరు ఏఎస్సైలు, 40 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 15 ద్విచక్రవాహనాలు, 4 ట్రాక్టర్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని సూచించారు. వాహనాలను ఇళ్లముందు నిలపడం వలన ఇతరులకు ఇబ్బందులు వస్తాయని అన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఉండడంతో ముందస్తుగా తనీఖీలు చేపట్టినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: ఆటోను ఢీకొన్న ఇసుక లారీ... విద్యార్థి మృతి