మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్ పారిశ్రామిక వాడలో ఉన్న రేడియంట్ కేబుల్స్, పాలిమర్ పరిశ్రమ, ఏరినా ఏవన్ ఇంజినీరింగ్ పరిశ్రమలను ఆయా శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సందర్శించారు. పరిశ్రమలకు తోడ్పాటు ఇవ్వాలనే సంకల్పంతో వాటిల్లో ఉత్పత్తి ప్రారంభించేందుకు పరిశ్రమ వర్గాలకు అవసరమైన సహకారం ప్రభుత్వం ఇస్తుందన్నారు.
పని ప్రదేశంలో కార్మికులు సామాజిక దూరం పాటించాలన్నారు, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించటంతోపాటు శానిటైజర్ వాడేలా చూడాలన్నారు. కార్మికులు పరిశ్రమ వాహనాల్లో పరిమితంగా రప్పించాలన్నారు. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేసే వరకు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు.