Revanth Comments on KCR : వరి కొనని సర్కార్‌ను ప్రజలే ఉరి తీస్తారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. కాళేశ్వరం మూడో టీఎంసీ, మల్లన్నసాగర్, కొండపోచమ్మకు భూములు త్యాగం చేసిన రైతులనే రీజినల్ రింగ్‌రోడ్ పేరుతో మరోసారి దగా చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. కోట్లు పలికే ఎకరా భూమికి పది లక్షల పరిహారం ఇస్తామనడంపై మండిపడ్డారు.
Revanth Reddy Fires on KCR : మెదక్ జిల్లాలోకి ప్రవేశించిన సర్వోదయ సంకల్ప పాదయాత్రలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్‌లో ప్రజలతో ముఖాముఖిలో కేసీఆర్ సర్కార్‌పై రేవంత్ ధ్వజమెత్తారు.
"రైతులకు వరి పండించవద్దని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ మాత్రం ఫాంహౌస్‌లో వరి పండించారు. రైతుల కడుపు కొట్టే హక్కు కేసీఆర్‌కు ఎవరిచ్చారు. పేద రైతులు పండించిన వరిని కొనుగోలు చేయాల్సిందే. మంచి ఉద్దేశంతో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ప్రారంభించారు. పేదల కష్టాలు తెలుసుకునేందుకే ఈ యాత్ర చేపట్టాం. ధరణి పోర్టల్ వల్ల పేదలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ సర్కార్ విధానాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికే కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులమంతా ఊరూరా తిరుగుతున్నాం. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటున్నాం."
- రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
- ఇదీ చదవండి : కుర్చీ కోసం తలలు పగలగొట్టుకున్నారు.. వీడియో వైరల్..