తెలంగాణ ఆర్టీసీ చరిత్రలోనే మొట్టమొదటిసారి సరకుల రవాణా కార్యక్రమానికి జూన్19న శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఆర్టీసీ ఉమ్మడి మెదక్ జిల్లా రీజనల్ మేనేజర్ రాజశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వాదేశాల మేరకు సంగారెడ్డి డిపో ఆధ్వర్యంలో ఆర్టీసీ, రెవెన్యూ పెంచే దిశగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సరకులు, వస్తువులను తక్కువ సమయంలో తక్కువ ధరలకు వారి గమ్యస్థానాలకు చేర్చనున్నట్టు చెప్పారు.
కరోనా ప్రభావంతో ఆర్టీసీ చాలా నష్టపోయిందని.. బస్సులు ప్రారంభించినా ప్రయాణికులు తక్కువ మోతాదులో రావటం వల్ల రెవెన్యూ తగ్గిందన్నారు.