శాసనసభ సమావేశాలు ఈ నెల7 నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు హాజరయ్యే వారందరూ కరోనా పరీక్ష తప్పకుండా చేసుకోవాలనే నిబంధనతోపాటు స్పీకర్ సూచన మేరకు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి దంపతులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు.
వారితో పాటు వారి కార్యాలయ సిబ్బంది కూడా కొవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. పరీక్షల్లో వీరందరికీ నెగెటివ్ వచ్చినట్లు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. అత్యవసరమైతే బయటకు వెళ్లాలని, ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కు ధరించాలన్నారు. వివాహ వేడుకలకు దూరంగా ఉండాలని కోరారు.
ఇదీ చదవండి: శత్రువు కన్నుగప్పి సరిహద్దుకు చేర్చే రహదారి సిద్ధం!