మెదక్ జిల్లా నర్సాపూర్‌లో కోతులు తెగబడ్డాయి. పోలీస్‌స్టేషన్ వెనుక వీధిలోని ఉమారాణి ఇంట్లో పని చేసుకుంటుండగా... కోతుల గుంపు దాడి చేసింది. శరీరంపై 15 నుంచి 20 చోట్ల తీవ్రంగా గాయపరిచాయి. మహిళ అరుపులు విన్న స్థానికులు... కర్రలతో దాడి చేయగా అక్కడి నుంచి వెళ్లిపోయాయి. తీవ్రంగా గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికైన అధికారులు స్పందించి వెంటనే కోతుల నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: 'పళ్లెత్తుగా ఉన్నాయని పెళ్లాన్నొదిలేశాడు'