ETV Bharat / state

'కొవిడ్​ సేవలకు వెంటనే నర్సుల నియామకం చేపట్టండి'

మెదక్ జిల్లా ఆస్పత్రిని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సందర్శించారు. ఆస్పత్రిలో కొవిడ్​ వార్డులు, చికిత్సల నిర్వహణను పరిశీలించారు. కొవిడ్​ బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు రామాయంపేటలో ఐసోలేషన్​ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.

mla padma visiting medak government hospital
మెదక్​ ఆస్పత్రిలో ఎమ్మెల్యే పద్మ పర్యవేక్షణ
author img

By

Published : Apr 26, 2021, 6:26 PM IST

మెదక్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో నర్సుల కొరత తీవ్రంగా ఉందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్న వారిని భర్తీ చేయటానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కల్లెక్టర్, డీఎంహెచ్​ఓను కోరారు. జిల్లా ఆస్పత్రిని ఆమె సందర్శించారు. కొవిడ్, లేబర్ వార్డు, ఇతర వార్డులను పరిశీలించారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు రామాయంపేటలో ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. కానీ కొవిడ్ రోగులు రావడం లేదని, వారిలో అవగాహన కల్పించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. జిల్లా ఆస్పత్రిలో 28 మంది రోగులకు గాను రెండు షిఫ్టుల్లో ఇద్దరు నర్సులు మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. కరోనా టెస్టుల నిర్వహణ తీరుపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

రోజురోజుకు కరోనా విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని పద్మాదేవేందర్​ రెడ్డి సూచించారు. అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. అంతకు ముందు ఇందిరాగాంధీ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్ ఉడెన్ కోర్టు పనుల పురోగతిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్​ వైస్ ఛైర్​పర్సన్ లావణ్యా రెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి నాగేరాజ్, మాజీ కౌన్సిలర్ అశోక్, కిష్టయ్య తధితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: లాక్​డౌన్​ విధింపుపై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.