ETV Bharat / state

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక

ప్రజల సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు 'మీకోసం' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆమె తెలిపారు.

MLA Padma Devender Reddy has launched news program for For the solution of public problems
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక
author img

By

Published : Mar 2, 2021, 3:55 PM IST

మెదక్‌ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నెలలో రెండు నెలల పాటు 'మీకోసం' అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఆర్డీవో సాయిరాంతో కలిసి ప్రజల వద్ద నుంచి వినతులను స్వీకరించారు.

కొత్తగా చేపట్టిన 'మీకోసం' అనే కార్యక్రమానికి స్పందన బాగుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి అన్నారు. ప్రతీ సమస్యను పరిష్కరించడమే తన లక్ష్యమని తెలిపారు. రెవెన్యూ, భూ తగాదా, పింఛను, వికలాంగుల, కార్పొరేషన్ లోన్లు, ఇళ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారం కోసం ఎక్కువ మంది వస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సమస్యలకు పరిష్కరించగలిగితే కార్యక్రమం విజయవంతం అయినట్లు భావిస్తామన్నారు. 15 రోజుల క్రితం వచ్చిన ఫిర్యాదులను 100 శాతం పరిష్కరించామని వివరించారు.

మార్చి 25 నుంచి నియోజకవర్గంలోని రామాయంపేట, నిజాంపేట మండలాల్లో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.