ETV Bharat / state

'రామలింగారెడ్డి లేకుండా ఇక్కడికి వచ్చినందుకు కన్నీళ్లు వస్తున్నాయి' - మంత్రి హరీశ్​ రావు వార్తలు

దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణం బాధకారమని మంత్రి హరీశ్‌ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమం కాలం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మెదక్ జిల్లా చేగుంట, నార్సింగి మండలాల లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సోలిపేట చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

harish rao
harish rao
author img

By

Published : Aug 25, 2020, 11:07 PM IST

దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి లేకుండా ఆయన నియోజకవర్గంలోని కార్యక్రమం పాల్గొనడం చాలా బాధాకరమని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా చేగుంట, నార్సింగి మండలాల లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

సోలిపేట చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. తెలంగాణ ఉద్యమం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రామలింగారెడ్డి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తానని మంత్రి అన్నారు. రెండు మండలాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

రామలింగారెడ్డి లేని లోటు పూడ్చలేనిదని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సహచర ఎమ్మెల్యేని, పోరాటాల యోధుడిని కోల్పోయామని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, చేగుంట, నార్సింగి ఎంపీపీలు మాసుల శ్రీనివాస్, చిందం సబితా రవీందర్, జడ్పీటీసీలు ముదాం శ్రీనివాస్, క్రిష్ణారెడ్డి, చేగుంట సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.