మెదక్ జిల్లాలో పకడ్భందీగా లాక్డౌన్ అమలుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ హరీశ్.. తహసీల్దార్లు, అధికారులకు సూచించారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ సడలింపు ఉన్నా.. చాలా మంది నిబంధనలు పాటించకపోవడం వల్ల కొవిడ్ వ్యాప్తి చెందుతుందని అన్నారు.
ప్రతి షాపు దగ్గర గుంపులు గుంపులుగా జనం ఉండకుండా చూడాలని సూచించారు. నిబంధనలు ఉల్లఘించిన దుకాణ యజమానులపై కేసు నమోదు చేయడంతో పాటు.. దుకాణం సీజ్ చేయాలని తెలిపారు.
శనివారం వైద్యాధికారులతో పాటు.. అన్ని మండలాల తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో రెండో విడత జ్వరసర్వే.. లాక్డౌన్ అమలు, ఉపాధి హామీ పథకం అమలుపై సమీక్షించారు.
లాక్డౌన్ వల్ల రెవెన్యూ రాబడి తగ్గుతున్నా... ప్రజల ప్రాణాలను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. కొందరు సమయం మించిన తర్వాత రోడ్డుపై తిరుగుతున్నారని అన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: 'బ్లాక్ ఫంగస్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే.. ముప్పు తక్కువ'