ETV Bharat / state

మెదక్ అదనపు కలెక్టర్ సహా నలుగురు అరెస్ట్.. కొనసాగుతున్న సోదాలు..!

నర్సాపూర్ భూవ్యవహారం కేసులో మెదక్ అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో అరుణ రెడ్డి, తహశీల్దార్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీంతో పాటు నగేష్​ బినామీగా భావిస్తున్న జీవన్ గౌడ్ అనే వ్యక్తిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అదనపు కలెక్టర్​తో పాటు నర్సాపూర్ ఆర్డీవో, ఇతర రెవెన్యూ అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

medak Additional Collector Nagesh Binami Arrested
నర్సాపూర్​ భూ వ్యవహారంలో.. నగేష్​ బినామీ అరెస్ట్!
author img

By

Published : Sep 10, 2020, 11:22 AM IST

వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎన్​వోసీ ఇవ్వడానికి దరఖాస్తుదారు నుంచి రూ. 1.12 కోట్లు తీసుకున్న మెదక్ అదనపు కలెక్టర్ నగేష్​​ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో చెరో లక్ష రూపాయలు లంచం తీసుకున్న నర్సాపూర్ ఆర్డీవో అరుణ రెడ్డి, తహశీల్దార్ అబ్దుల్ సత్తార్​తోపాటు జూనియర్ అసిస్టెంట్ వసీం, నగేష్​కు బినామీగా వ్యవహరిస్తున్న జీవన్ గౌడ్​ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. వీరిని హైదరాబాదులోని ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరుచనున్నారు.

ఇప్పటికే అధికారులు అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో అరుణ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. నగేష్ క్యాంపు కార్యాలయంలో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కొంపల్లిలోని నగేష్ నివాసంలో బ్యాంకు లాకర్​ తాళంచెవి స్వాధీనం చేసుకున్నారు. బోయిన్​పల్లిలోని ఆంధ్రాబ్యాంకులో లాకర్ ఖాతా ఉన్నట్లు గుర్తించి దాన్ని తాత్కాలికంగా జప్తు చేయాల్సిందిగా బ్యాంకు అధికారులకు లేఖ రాశారు. ఆర్డీవో అరుణ రెడ్డికి చెందిన ఘట్​కేసర్ నివాసంలో అధికారులు సోదాలు చేసి రూ.28 లక్షల నగదు, అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు.

శేరిలింగంపల్లికి చెందిన లింగమూర్తి నర్సాపూర్ మండలం చిప్పల్​తుర్తిలో ఈ ఏడాది ఫిబ్రవరిలో 112 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. రెవెన్యూ రికార్డుల్లో 22a కింద ఉన్న ఈ భూమిని నిషేధిత జాబితా ప్రకారం రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు రికార్డుల్లో నమోదు చేయలేదు. రెవెన్యూ శాఖ అధికారుల నుంచి ఎన్ఓసి తీసుకురావాలని సూచించగా.. లింగమూర్తి జులైలో నర్సాపూర్ తహశీల్దార్ అబ్దుల్ సత్తార్​కు దరఖాస్తు చేసుకున్నాడు. అతను ఆ దరఖాస్తును నర్సాపూర్ ఆర్డీవోకు పంపగా.. అక్కడినుంచి ఆ దస్త్రం అదనపు కలెక్టర్ నగేష్ వద్దకు చేరింది. ఎన్​వోసీ ఇవ్వడానికి ఎకరానికి లక్ష చొప్పున కోటి 12 లక్షలు ఇవ్వాలని అదనపు కలెక్టర్ నగేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు లింగమూర్తి జులైలో 19.5 లక్షలు.. ఆగస్టులో 20.5 లక్షలు అదనవు కలెక్టర్ నగేష్​కు చెల్లించాడు. మరో 72 లక్షలు చెల్లించాల్సి ఉండగా తన వద్ద నగదు లేకపోవడం వల్ల ఐదెకరాల భూమిని అగ్రిమెంట్ చేశాడు. అదనపు కలెక్టర్ నగేష్ తన బినామీ అయిన జీవన్ గౌడ్ పేరు మీద ఆ ఐదెకరాల భూమిని అగ్రిమెంట్ చేయించాడు. భూమి రిజిస్ట్రేషన్ చేసేంతవరకు జామీనుగా లింగమూర్తి నుంచి ఎనిమిది ఖాళీ చెక్కులను అదనపు కలెక్టర్ నగేష్ తీసుకున్నాడు.

ఎన్​వోసీ ఇచ్చేందుకు తహశీల్దార్, ఆర్డీవోలకు కూడా డబ్బులు ఇవ్వాలని నగేష్ సూచించడంతో లింగమూర్తి ఐదు లక్షల రూపాయలను జూనియర్ అసిస్టెంట్ వసీం​కు ఇచ్చాడు. ఇందులో నుంచి లక్ష రూపాయలు ఆర్డీవో అరుణ రెడ్డికి, లక్ష రూపాయలు తహశీల్దార్ సత్తార్​కు వసీం చెల్లించాడు. మిగతా మూడు లక్షలు తన వద్దే ఉంచుకున్నాడు. అధికారుల లంచం వ్యవహారాన్ని లింగమూర్తి అనిశా అధికారులకు ఆధారాలతో సహా సమర్పించాడు. దీంతో అధికారులు 12బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో దాడులు చేశారు. అనిశా దాడుల్లో మెదక్​ అదనపు కలెక్టర్ నగేష్​ ఆధారాలతో సహా దొరికిపోయాడు.

కీసర తహశీల్దార్ నాగరాజు రూ.కోటి 10 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన వ్యవహారం మరిచిపోకముందే మెదక్ అదనపు కలెక్టర్ రూ.1.12 కోట్లు లంచం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నర్సాపూర్ భూముల వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : ఉత్తమ్ సాక్షిగా కాంగ్రెస్ నేతల మాటల యుద్ధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.