మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ సర్పంచ్ నత్తి మల్లేశ్‌ను ఆరు నెలలపాటు సస్పెండ్ చేస్తూ జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ రకాల కారణంగా అతన్ని సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉప సర్పంచే సర్పంచ్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ చెప్పారు.
హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సరిగ్గా కాపాడకలేకపోవడం, తడి పొడి చెత్త వేరు చేయడంలో నిర్లక్ష్యం, చెత్తను చెరువులో పోయడం వంటివి చేయలేదంటూ కలెక్టర్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. అందుకు సరైన సమాధానం ఇవ్వనందున సర్పంచ్ మల్లేశ్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.