ETV Bharat / state

'వైకల్యం శరీరానికే కాని హృదయానికి కాదు' - మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తాజా వార్తలు

మహిళా, శిశు సంక్షేమ శాఖ, డీఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీ సమీక్షా సమావేశంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీయస్పీ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. వైకల్యం అనేది ఒక లోపం మాత్రమే శాపం కాదని.. అధైర్య పడకుండా ఆత్మ న్యూనతా భావం విడనాడాలని పలువురు స్పష్టం చేశారు.

International Disability Day District Level Committee Review Meeting
'వైకల్యం అనేది శరీరానికే కాని హృదయానికి కాదు'
author img

By

Published : Dec 7, 2020, 9:13 PM IST

వైకల్యం అనేది శరీరానికే కాని హృదయానికి కాదని.. ప్రతి ఒక్కరిలో ఎదో ఒక లోపం ఉంటుందని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మనోధైర్యంతో ఆ లోపాన్ని అధిగమించి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, డీఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో​ జిల్లా స్థాయి కమిటీ సమీక్షా సమావేశంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. కల్లెక్టరేట్​లోని ప్రజావాణి సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

సదరన్ క్యాంపులు ఈ నెలలో..

కరోనా కారణంగా ఆగిపోయిన సదరన్ క్యాంపులు ఈ నెలలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం. అర్హులైన దివ్యాంగులందరికీ సర్టిఫికేట్​లు అందజేస్తాం. జిల్లాలో 8,957 మందికి ఆసరా పింఛన్లు, 218 మహిళా సమాఖ్య బృందాలకు బ్యాంకు రుణాలు అందిస్తున్నాం. ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ కార్యక్రమాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలి.

-డీఆర్​డీఓ శ్రీనివాస్

ఏ సమస్య వచ్చినా వెంటనే 100కు డయల్ చేయాలని.. స్పందన రాకపోతే తన సెల్ నంబర్​ 9490617007 కు ఫోన్ చేస్తే సమస్య పరిష్కరిస్తానని డీయస్పీ కృష్ణమూర్తి అన్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే అవసరం లేదని స్పష్టం చేశారు.

వైకల్యం అనేది ఒక లోపం మాత్రమే శాపం కాదని.. అధైర్య పడకుండా ఆత్మ న్యూనతా భావం విడనాడాలని పలువురు స్పష్టం చేశారు. ఏదైనా సాధించగలమన్న నమ్మకంతో కృషి చేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా విద్యా శాఖాధికారి రమేష్, జిల్లా సంక్షేమ శాఖాధికారి రసూల్ బీ దివ్యాంగులను ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సంతోష, దివ్యాంగుల సంఘాల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, అశోక్ కుమార్, ఇంఛార్జి జిల్లా ఉపాధి అధికారి విజయకుమార్, దివ్యాంగులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రేపటి భారత్‌ బంద్‌కు రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచి మద్దతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.