మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి కురుస్తోన్న వానతో నర్సాపూర్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వీధుల్లో, ఇళ్లలో నీరు చేరింది. చిన్నపాటి వర్షం కురిసినా ఈ ఇబ్బందులు తప్పడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా శాశ్వత పరిష్కారం చూపడం లేదని వాపోయారు.
వర్షం వస్తే వణుకే...
మురుగు కాలువలు నిర్మిస్తే నీరు సాఫీగా పోతుందని అన్నారు. శాశ్వత పరిష్కారం చేయాలని కోరుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. వర్షం వస్తే వణుకు అన్నట్లుగా తమ పరిస్థితి మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బయటకు వెళ్తే ఇంటికి రావడం కష్టంగా మారిందని వాపోయారు.
ఇదీ చదవండి: హైదరాబాద్లో వర్షం.. పలు ప్రాంతాలు జలమయం