ETV Bharat / state

కూరగాయల రైతులకు మంచి రోజులు

author img

By

Published : Jul 17, 2019, 1:01 PM IST

మొదక్ జిల్లా ములుగులో మూడేళ్ల కిందట అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం కేసీఆర్‌ చెప్పిన మాటలను నిజం చేసి చూపించారు. ములుగులో కూరగాయల నారు పెంపకం కేంద్రానికి అవసరమైన నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయించారు.

కూరగాయల రైతులకు మంచి రోజులు

మానవాళికి నిత్యావసర సరకుల్లో ఎంతో ముఖ్యమైనవి కూరగాయలు. రోజూ వాటి అవసరం ఎంతో ఉంటుంది. డిమాండ్‌కు తగ్గట్టుగా ఒక్కోసారి అవి అందుబాటులో ఉండటం లేదు. కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. మరోవైపు నాణ్యమైన నారు లభించక రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. రైతులు కూరగాయలు పండించేందుకు అవసరమైన నారును పెంచి ప్రభుత్వం వారికి అండగా నిలవనుంది. నెల రోజుల్లో వినియోగంలోకి రానున్న మొదక్ జిల్లా ములుగు ఫల పరిశోధన కేంద్రంలోని కూరగాయల నారు పెంపక కేంద్రం తీరు తెన్నులపై ‘ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

నాణ్యమైన వంగడాలతో రూపకల్పన

ములుగు ఉద్యాన విశ్వవిద్యాలయం సమీపంలో ఫల పరిశోధన కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో నాణ్యమైన కూరగాయల నారును పెంచి రైతులకు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.4 కోట్ల నిధులు మంజూరు చేసింది. వీటితో టమాటా, వంగ, మిర్చి, క్యాప్సికం కూరగాయల నారు పెంపకానికి అవసరమైన 4 షెడ్లను ప్రత్యేకంగా నిర్మించారు. మొదటి షెడ్డులో సేంద్రియ ఎరువులు, విత్తనాలను మిళితం చేసి యంత్రాలతో ట్రేలలో నింపుతారు. వాటిని రెండో షెడ్డులోకి తరలిస్తారు. ట్రేలను రెండో షెడ్డులో ఐదు రోజుల పాటు ఉంచి వాటికి కావాల్సిన నీటిని యంత్రాల ద్వారానే అందిస్తారు. ఐదు రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. మొలకెత్తిన వాటిని మూడో షెడ్డులోకి తరలిస్తారు. వాటిని మూడో షెడ్డులో వారం రోజుల పాటు ఉంచుతారు. అవసరమైన ఉష్ణోగ్రతకు టెంపరేచర్‌ మీటర్లతో పాటు మొక్కలకు బలాన్ని చేకూర్చే ఎరువులు అక్కడే అందిస్తారు. 15 రోజుల తర్వాత ఫల పరిశోధన కేంద్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షేడ్‌నెట్‌లోకి ఆ ట్రేలను తరలిస్తారు. అక్కడ నెల రోజులు పూర్తి అవగానే వాటిని రైతులకు రాయితీపై అందిస్తారు.

ఏడాదికి 80 లక్షల మొక్కలు..

ములుగు ఫల పరిశోధన కేంద్రంలో ఈ సంవత్సరం టమాటా, మిర్చి, వంగ, క్యాప్పికం కూరగాయల నారును సిద్ధం చేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులు పండిస్తున్న కూరగాయల విత్తనాలను ఉద్యాన శాఖ అధికారులు సేకరించి వాటి నుంచి నారు పెంచుతారు. అలా పెంచిన నారును రాయితీపై రైతులకు అందిస్తారు. ఈ కేంద్రంలో ప్రతి ఏటా 80 లక్షల మొక్కలు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ నమూనాగా నారు తయారు చేస్తున్నారు. ఆ నారును ఇక్కడే నాటి దిగుబడులు పరిశీలిస్తారు. మంచి దిగుబడులు రాగానే అదే తరహాలో మరిన్ని మొక్కలను ఉత్పత్తి చేసి రైతులకు సరఫరా చేస్తారు. నెల రోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.

రైతులకు మేలు చేసేందుకే..

రాష్ట్రంలో కూరగాయలు పండించే రైతుల సంఖ్య అధికంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలిపారు. నాణ్యమైన నారు అందక ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు నాణ్యమైన నారును అందించి అధిక దిగుబడులు సాధించేలా చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని వెల్లడించారు. అందుకే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఏటా రైతులకు 80 లక్షల మొక్కలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలి..

కూరగాయలు పండించే ప్రతి రైతుకు తక్కువ ధరకు నాణ్యమైన నారును అందించాలన్నదే లక్ష్యమని ఉద్యాన శాఖ సంచాలకులు వెంకటరామిరెడ్డి తెలిపారు. అందులో భాగంగానే ప్రత్యేకంగా పరిశోధనలో రూపొందించిన నారును సిద్ధం చేస్తున్నామని స్పష్టం చేశారు. త్వరలోనే రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామని, ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెంకటరామిరెడ్డి సూచించారు.

ఇవీ చూడండి: కర్ణాటకీయం: స్వామి సర్కారు పతనం తథ్యం!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.