మెదక్ జిల్లా ఘనపూర్ ఆనకట్టను వనదుర్గ ఆనకట్టగా పేరు మార్చామని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్ రెడ్డి పేర్కొన్నారు. ఏడుపాయల అమ్మవారిని దర్శించుకుని జాతర ఏర్పాట్లను సమీక్షించారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని... పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని కోరినట్లు ఆయన తెలిపారు.
ఏడు పాయలను మరింత అభివృద్ధి చేస్తామని శేరి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. రోడ్డు విస్తరణ కోసం నిధులు మంజూరు చేశామని... వచ్చే శివరాత్రి నాటికి పోతాంశెట్టిపల్లి నుంచి ఏడు పాయల వరకు సీసీ రోడ్లు పూర్తవుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రశాంత్ రెడ్డి, కొత్తపల్లి సొసైటీ ఛైర్మన్ రమేశ్, సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు జగన్, మండల నాయకులు బాలాగౌడ్, కిష్టాగౌడ్, గౌస్, సర్పంచులు వెంకట్ రెడ్డి, సంజీవ రెడ్డి, శ్రీకాంత్, ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: భాజపా ఏమి చేసిందని ప్రజలు ఓటు వేయాలి: ఎర్రబెల్లి