రోడ్లపై మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి నర్సాపూర్ పోలీసులు జరిమానాలు విధించారు. ముఖానికి మాస్క్‌లు లేకుండా బయటకు రావద్దని హెచ్చరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో పోలీసులు... లాక్డౌన్ నిబంధనలు పాటించని వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు.
ముఖానికి మాస్కులు లేకుండా బయటకు వచ్చిన వారికి జరిమానాలు విధిస్తున్నట్లు నర్సాపూర్ సీఐ నాగయ్య, ఎస్సై సత్యనారాయణ తెలిపారు. కోవిడ్ చట్టం కింద ఆన్లైన్లో కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరు కోర్టులో చెల్లించాలని పోలీసులు సూచించారు.
ఇవీ చూడండి: ఆసుపత్రికి వెళ్లాలంటే.. డోలీ ఎక్కాల్సిందే!