మెదక్ జిల్లా చిన్న శంకరం పేట మండలం రామయంపల్లి గ్రామంలో రైతులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. రైస్ మిల్ యజమాని ఐకేపీ ధాన్యంలో పొల్లు ఉందని లారీలో ఉన్న ధాన్యాన్ని తిరస్కరించినందుకు ధర్నా చేపట్టారు. అనంతరం ధాన్యానికి నిప్పుపెట్టారు.
సన్న ధాన్యానికి రూ. 2,500 గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. వీరికి సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశ్ సంఘీభావం తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను సన్న రకం సాగు చేయించి వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తానని చెప్పి మద్దతు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. తాను మాత్రం తన ఫాంహౌస్లో దొడ్డు రకం ధాన్యాన్ని పండించి కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకున్నారని ఆరోపించారు. మరి తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
ఇకనైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యానికి రూ. 2,500 మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని.. లేకుంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: సన్నరకం ధాన్యానికి మద్దతు ధర కల్పించాలంటూ రైతుల ఆందోళన